Monday, November 18, 2024

అమెరికాలో హెలెన్ హరికేన్ విధ్వంసం.. 43 మంది మృతి

అగ్ర రాజ్యం అమెరికాను హెరికేన్ గజగజా వణికిస్తోంది. మొత్తం నాలుగు రాష్ట్రాలు గత రెండు రోజులుగా హెలెన్ తుపాను ధాటికి అతలాకుతలం అవుతున్నాయి.  నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, ఫ్లోరిడా, జార్జియా  రాష్ట్రాలు హెలెన్ తుఫానుకు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో తుఫాను కారణంగా మొత్తం 43 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. హెలెన్ హరికేన్ ఫ్లోరిడా, జార్జియాతో సహా మొత్తం ఆగ్నేయ అమెరికాలో భారీ విధ్వంసం సృష్టించింది. హెలెన్ హరికేన్ గురువారం రాత్రి 11 గంటలకు ఫ్లోరిడాలోని బిగ్ బెండ్ గ్రామీణ ప్రాంతంలో తీరాన్ని తాకిందని నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. ఆ సమయంలో దీని గరిష్ట వేగం గంటకు 225 కిలోమీటర్లు. హెలెన్ శుక్రవారం ఉదయం జార్జియాను దెబ్బతీసింది. జార్జియా తాకినప్పుడు దాని గాలి వేగం గంటకు 177 కిలోమీటర్లుగా ఉందని పేర్కొంది.
హెలెన్ హరికేన్ కారణంగా జార్జియా రోడ్లన్నీ చాలావరకు నీటిలో మునిగిపోయాయి. తుఫాను కారణంగా ఆగ్నేయ అమెరికాలోని చాలా ప్రాంతాల్లో బలమైన గాలులు, వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. బలమైన గాలులు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హెలెన్ తుఫాను ఉత్తర దిశగా కదులుతున్నట్లు నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. తుఫాను రాకముందే ఫ్లోరిడాలో బలమైన గాలుల కారణంగా దాదాపు 9 లక్షల ఇళ్లు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎన్ డబ్ల్యూఎస్ అట్లాంటా, పరిసర ప్రాంతాలతో సహా సెంట్రల్ జార్జియాకు ఫ్లాష్ వరద హెచ్చరికను జారీ చేసింది. ఈ ప్రాంతంలో 246 పాఠశాలలు, 23 ఆసుపత్రులు ఉన్నాయని, ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది నివాసితులు ప్రమాదంలో ఉన్నారని హెచ్చరించింది. సుమారు 45 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular