Saturday, October 5, 2024

ఇంకా ప్రమాదకరంగా మారిన హుస్సేన్​సాగర్

  • వినాయక విగ్రహాల నిమజ్జనంతో కాలుష్య కాసారం
  • అధిక మోతాదులో రసాయనాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడించిన పీసీబీ

భాగ్యనగరంలో వినాయక విగ్రహాల నిమజ్జన సమయంలో హుస్సేన్‌ సాగర్‌లో విపరీతమైన నీటి కాలుష్యం నమోదైందని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) స్పష్టం చేసింది. లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్‌ వైపు ఐదు ప్రాంతాల్లో క్రోమియం అధిక మోతాదులో ఉన్నట్లు నిర్ధారించింది. గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి ముందు, తర్వాత సాగర్ చుట్టుపక్కల ఆరు ప్రాంతాల్లో నీటి నాణ్యతను టెస్ట్ చేసిన పీసీబీ తాజాగా ఫలితాలను విడుదల చేసింది. నెక్లెస్‌రోడ్, బుద్ధ విగ్రహం, లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్, ఎన్టీఆర్‌ పార్కు వద్ద రెండు చోట్ల, లుంబినీ పార్కు సమీపంలో అనేక నమునాలను సేకరించిన అధికారులు ల్యాబ్‌కు పంపించారు. నీటిలోని టీడీఎస్‌(టోటల్‌ డిజాల్వుడ్‌ సాలిడ్స్‌), టీఎస్‌ఎస్‌(టోటల్‌ సస్పెండెడ్‌ సాలిడ్స్‌), సీవోడీ(కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌), డీవో(డిజాల్వుడ్‌ ఆక్సిజన్‌), బీవోడీ(బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌), టోటల్‌ కొలిఫామ్, ఫీకల్‌ కొలిఫామ్‌ స్థాయులు ఎలా ఉన్నాయో వెల్లడించారు.

నమోదయిన వివరాలు
సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం వేళ అన్ని చోట్ల TSS (Total Suspended Solids) టీఎస్‌ఎస్‌(టోటల్‌ సస్పెండెడ్‌ సాలిడ్స్‌)- నీటి అడుగున చేరే మలినాలు, టర్బిడిటీ అధిక మోతాదులో ఉంది. తర్వాత తగ్గినా, నిమజ్జనం ముందున్న స్థాయికి మాత్రం చేరుకోలేదు. బుద్ధ విగ్రహం, ఎన్టీఆర్‌ పార్కు, లుంబినీ పార్కు వద్ద అత్యధిక మోతాదులో టీడీఎస్‌(టోటల్‌ డిజాల్వుడ్‌ సాలిడ్స్‌) నమోదైంది. దీంతో చర్మ సంబంధ దుద్దుర్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి.

బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌(బీవోడీ), కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌(సీవోడీ) స్థాయిలు పెరిగిపోయాయి. బీవోడీ పెరిగితే కాలుష్యం పెరిగినట్టే అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది లీటరు నీటిలో 3 ఎంజీల కంటే ఎక్కువ నమోదుకాకూడదు. అన్ని ప్రాంతాల్లో అంతకు మించి నమోదైంది. నీటిలో ఉండే జీవుల మనుగడకు అవసరమైన డిజాల్వుడ్‌ ఆక్సిజన్‌(డీవో) లీటరు నీటిలో 4ఎంజీల కంటే తక్కువగా ఉండరాదు. కానీ సాగర్‌లో చాలా చోట్ల 2.5-4 మధ్య నమోదైంది. గత సంవత్సరంతో పోలిస్తే ఎన్టీఆర్‌ పార్కు ప్రాంతం మినహా ఇతర ప్రాంతాల్లో టీడీఎస్‌ స్థాయులు ఒకేలాగా ఉన్నాయి. లుంబినీ పార్కు, ఎన్టీఆర్‌ పార్కు, నెక్లెస్‌రోడ్‌ ప్రాంతాల్లో కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ తక్కువగా నమోదైంది.

హైదరాబాద్​లోని హుస్సేన్​ సాగర్​లో నిమజ్జన సమయంలో అక్కడ విపరీతమైన జల కాలుష్యం నమోదైనట్లు కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. అయితే హుస్సేన్​ సాగర్​ పరివాహకంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక మోతాదులో కాలుష్యం నమోదైతే, మరికొన్నింటిలో తక్కువ మోతాదులో కాలుష్యం ఉందని తెలిపింది. లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్​ వైపు ఐదు చోట్ల క్రోమియం అధిక మోతాదులో ఉన్నట్లు నిర్ధారణ అయింది. విగ్రహాల నిమజ్జనానికి ముందు, ఆ తర్వాత జలాశయం చుట్టుపక్కల ఆరు ప్రాంతాల్లో పీసీబీ నీటి నాణ్యతను పరీక్షించింది. ఈ పరీక్షల ఫలితాలను తాజాగా పీసీబీ వెల్లడించింది. వీటిలో ఎన్టీఆర్​ పార్కు వద్ద రెండు చోట్ల, లుంబినీ పార్కు సమీపంలోనూ, నెక్లెస్​ రోడ్, బుద్ధ విగ్రహం, లేపాక్షి హ్యాండిక్రాఫ్ట్స్ వద్ద పీసీబీ అనేక శాంపిళ్లను సేకరించి ల్యాబ్​కు పంపారు. ఇక్కడి నీటిలోని టీడీఎస్​(టోటల్​ డిజాల్వుడ్​ సాలిడ్స్​), టీఎస్​ఎస్​(టోటల్​ సస్పెండెడ్​ సాలిడ్స్​), సీవోడీ(కెమికల్​ ఆక్సిజన్​ డిమాండ్​), డీవో(డిజాల్వుడ్​ ఆక్సిజన్​), బీవోడీ(బయోకెమికల్​ ఆక్సిజన్​ డిమాండ్​), ఫీకల్​ కొలిఫామ్, టోటల్​ కొలిఫామ్​ స్థాయిలు ఎలా ఉన్నాయో పరీక్షించి ఫలితాలు వెల్లడించింది.

హుస్సేన్​ సాగర్​ నీటిని పరీక్షించిన తర్వాత రిపోర్టు :
హుస్సేన్​ సాగర్​లో విగ్రహాల నిమజ్జనం వేళ అన్ని చోట్ల టీఎస్​ఎస్​ అంటే నీటి అడుగున చేరే మలినాలు, టర్బిడిటీ ఎక్కువ మోతాదులో ఉందని తెలిపింది. ఆ తర్వాత తగ్గినా, నిమజ్జనం ముందున్న స్థాయికి మాత్రం చేరుకోలేదంది. ఎన్టీఆర్​ పార్కు, బుద్ధ విగ్రహం, లుంబినీ పార్కు వద్ద అత్యధిక మోతాదులో Total Dissolved Solids (TDS) టోటల్​ డిజాల్వుడ్​ సాలిడ్స్​(టీడీఎస్​) నమోదు అయింది. దీంతో చర్మంపై దద్దుర్ల సమస్యలు ఉత్పన్నం అవుతాయి. జలచరాల మనుగడకు అవసరమైన డిజాల్వుడ్​ ఆక్సిజన్​ లీటరు నీటిలో 4 ఎంజీల కంటే తక్కువ ఉండకూడదు. అయితే హుస్సేన్​ సాగర్​లో చాలా చోట్ల 2.5 నుంచి 4 మధ్య విలువలు నమోదు అయ్యాయి.

గతేడాదితో పోలిస్తే ఎన్టీఆర్​ పార్కు ప్రాంతం మినహా ఇతర ప్రాంతాల్లో టీడీఎస్​ స్థాయిలు ఒకేలా ఉన్నాయని తెలిపింది. ఎన్టీఆర్​ పార్కు, నెక్లెస్​ రోడ్​, లుంబినీ పార్కు ప్రాంతాల్లో కెమికల్​ ఆక్సిజన్​ డిమాండ్​ తక్కువగా నమోదు అయినట్లు పేర్కొంది. కెమికల్​ ఆక్సిజన్​ డిమాండ్​, బయో కెమికల్​ ఆక్సిజన్​ డిమాండ్​ స్థాయిలు పెరిగిపోయాయి. బీవోడీ పెరిగితే కాలుష్యం పెరిగినట్లేనని నిపుణులు తెలుపుతున్నారు. లీటరు నీటిలో 3 ఎంజీల కంటే ఎక్కువ నమోదు కాకుండా ఉండాలి. హుస్సేన్​ సాగర్​లోని అన్ని ప్రాంతాల్లో అంతకు మించి నమోదు అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular