రాయితీలను రద్దు చేస్తూ నిర్ణయం
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బిగ్ షాక్ ఇచ్చింది. ప్రయాణికులకు అందించే పలు రాయితీలను మెట్రో రైల్ అధికారులు రద్దు చేశారు. 59 రూపాయల హాలీడే కార్డు, మెట్రో కార్డుపై ఇచ్చే 10 శాతం రాయితీలను రద్దు చేశారు. రాష్ట్రంలో పెరిగిన ఎండల తీవ్రతతో మెట్రో ప్రయాణానికి భారీగా డిమాండ్ పెరిగింది.
Also Read: రాష్ట్రంలో బీరు ప్రియులకు షాక్..!
ఈ నేపథ్యంలో డిస్కౌంట్ ఆఫర్లను రద్దు చేస్తూ మెట్రో రైలు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉన్నఫలంగా రాయితీలను రద్దు చేయడంతో మెట్రో అధికారుల తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రయాణికుల రద్దీ పెరగడంతో కోచ్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.