Thursday, April 3, 2025

టెక్నాలజీలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోంది

ఫార్మా, లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్, బయో-టెక్నాలజీ పరిశ్రమలకు పవర్‌హబ్‌గా హైదరాబాద్
ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో పాటు టెక్నాలజీలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కామన్వెల్త్ మీడియేషన్ -ఆర్బిట్రేషన్ కాన్ఫరెన్స్- 2024 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్, బయో-టెక్నాలజీ పరిశ్రమలకు పవర్‌హబ్‌గా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు.

న్యాయవ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అని, కానీ, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉండడం న్యాయవ్యవస్థకు సవాల్‌గా మారిందన్నారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడానికి, వేగంగా, సమర్థవంతంగా కేసుల పరిష్కారానికి ప్రత్యామ్నాయ వ్యవస్థలు అవసరమని సిఎం రేవంత్ తెలిపారు. మధ్యవర్తిత్వం, చర్చల ద్వారా వీలైనంత త్వరగా సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. అలా చేయడం వల్ల వివాదంలో చిక్కుకున్న ఇరువర్గలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

అందుకు కృషి చేస్తున్న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ నిర్వాహకులను అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. మీడియేషన్, ఆర్బిట్రేషన్‌ను సమన్వయం చేస్తే సమస్యలు, వివాదా లను వీలైనంత వేగంగా పరిష్కరించవచ్చన్నారు. ఐఏఎంసిసి అనేది తెలంగాణకు మాత్రమే పరిమితం కాదన్నారు. దేశం మొత్తానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. ఐఏఎంసిని గ్లోబల్ ఇన్వెస్టర్లు, బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే పరిమితం చేయొద్దని ఆయన అన్నారు. సామా న్యుడికి చిన్న సంస్థలకు కూడా ఐఏఎంసి సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. లండన్, సింగపూర్ తర్వాత ఆర్బిట్రేషన్ మ్యాప్‌లో హైదరాబాద్ ఉండటం గర్వకారణమన్నారు. ఆర్బిట్రేషన్ సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావడంపై మరో సదస్సు నిర్వహించాలని సిఎం రేవంత్ సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com