Sunday, November 17, 2024

వేగంగా అభివృద్ధి నగరాల్లో హైదరాబాద్​

  • వేగంగా అభివృద్ధి నగరాల్లో హైదరాబాద్​
  • రియల్​ ఎస్టేట్​ ఏ డికేట్​ ఫ్రమ్​ నౌ నివేదికలో వెల్లడి

టీఎస్​, న్యూస్​:ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ నిలిచింది. టాప్-10 జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. కాన్పెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)తో కలిసి నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. రియల్ ఎస్టేట్: ఎ డికేట్ ఫ్రమ్ నౌ 2024 పేరుతో నివేదికను రూపొందించింది.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌కు (Hyderabad) చోటు దక్కింది. టాప్-10 జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. కాన్పెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)తో కలిసి నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. రియల్ ఎస్టేట్: ఎ డికేట్ ఫ్రమ్ నౌ 2024 పేరుతో ఆ నివేదికను రూపొందించింది. 2019 నుంచి 2035 వరకు హైదరాబాద్ గణనీయమైన అభివృద్ధి సాధించనుందని అంచనా వేసింది. రియల్ ఎస్టేట్ భూమ్ వల్ల అభివృద్ది వేగంగా జరుగుతోందని పేర్కొంది.

2018లో హైదరాబాద్ 8.47 శాతం అభివృద్దితో స్థూల జాతీయోత్పత్తి 50.6 బిలియన్ల డాలర్ల వద్ద కొనసాగింది. 2035 నాటికి అది 201.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని లెక్కగట్టింది. నివేదిక ప్రకారం సూరత్ మొదటి స్థానంలో ఉండగా, ఆగ్రా, బెంగళూర్ మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. బెంగళూర్, పుణె, హైదరాబాద్ కలిసి 20 బిలియన డార్ల పెట్టుబడులను ఆకర్షించాయని పేర్కొంది. ఈ నగరాల్లో ఐటీ వల్ల స్థలాలకు అధిక డిమాండ్ ఉంటుంని వివరించింది. 2004 నుంచి హైదరాబాద్ 4.836 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సేకరించిందని వెల్లడించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular