వేసవిలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సొంతూళ్లకు, టూర్లకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. అందులో భాగంగా తిరుమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఒక్కో సర్వీస్ చొప్పున ఈ రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. రైలు నెంబర్ 07489 సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మే 11వ తేదీన రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ రైలు రాత్రి 10.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరితే మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు దారిలో కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, రాయిచూర్ జంక్షన్, మంత్రాలయం రోడ్, ఆథోని, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట జంక్షన్ స్టేషన్‌లలో ఆగుతుంది.
రేణిగుంట జంక్షన్, గూడూరు, నెల్లూరులో…
రైలు నెంబర్ 07490 తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు మే 13వ తేదీన అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రైలు రాత్రి 7.50 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ రైలు రేణిగుంట జంక్షన్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ, మౌలాలి స్టేషన్‌లలో ఆగుతుంది.
సికింద్రాబాద్ టు తిరుపతిల మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్ టు తిరుపతిల మధ్య ఈ రెండు రైళ్లు కాకుండా మరిన్ని ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. రైలు నెంబర్ 07009 మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌కు మే 10వ తేదీన అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 07250 సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్‌కు మే 11వ తేదీన అందుబాటులో ఉంటుందని, రైలు నెంబర్ 07057 కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్‌కు మే 13వ తేదీన అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.
రైలు నెంబర్ 06227 యశ్వంత్‌పూర్ నుంచి బీదర్‌కు మే 6వ తేదీన అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. రైలు నెంబర్ 06228 బీదర్ నుంచి యశ్వంత్‌పూర్ వరకు మే 7వ తేదీన అందుబాటులో ఉంటుందని, ఈ ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.