తాజాగా 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటిన మెట్రో
హైదరాబాద్ మెట్రో మరో ఘనతను సాధించింది. తాజాగా 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటిందని మెట్రోరైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. గ్రీన్‌మైల్స్ లాయల్టీ క్లబ్‌ను ఆవిష్కరించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ మెట్రోపై ప్రయాణికుల నమ్మకం పెరిగిందని ఆయన చెప్పారు.
మెట్రో రైలు వల్ల 14.5 లీటర్ల ఇంధనం ఆదా అయ్యిందన్నారు. ప్రతిరోజు సగటున 5.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని ఆయన వెల్లడించారు. రెండో దశ మెట్రోరైలుకు కూడా ఇప్పటికే డిపిఆర్‌లు సిద్ధమయినట్టు ఆయన తెలిపారు.