Friday, September 20, 2024

వేర్వేరు స్టేషన్లుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు

  • ఉద్యోగ సంఘాల ఒత్తిడితో శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు
  • ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను వేర్వేరు స్టేషన్లుగా గుర్తిస్తు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు ఆరేళ్ల తరువాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులంతా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం శుక్రవారం జీఓను విడుదల చేసింది. 2018లో బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారి మాత్రమే బదిలీల ప్రక్రియ జరిగింది.

అదీ శాస్త్రీయంగా చేయకుండా రాజకీయ ఒత్తిళ్లకు మేరకు జరిగాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిని జీహెచ్‌ఎంసి కింద పరిగణించి బదిలీలు చేయడంతో ఇక్కడ నుంచి బయట జిల్లాలకు బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. ఈ మూడు జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులంతా హైదరాబాద్‌లోనే నివాసముంటున్నారు. ఇదే అంశాన్ని ఉద్యోగ సంఘాలు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించాయి.

దాదాపు 80 వేల మంది ఉద్యోగుల బదిలీలు
జిల్లాల వారీగా కలెక్టరేట్లు విడిగా ఏర్పాటు చేసినందున హైదరాబాద్‌లో పనిచేసే వారు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు బదిలీపై వెళ్లేలా వేర్వేరు స్టేషన్లుగా గుర్తించాలని కోరారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విభాగాల ఉద్యోగులు కలిపి మొత్తం 2, 50,000 మంది వరకు ఉండగా ఇందులో 40 శాతం మేర బదిలీలు చేయనున్నారు. దాదాపు 80 వేల మంది ఉద్యోగుల బదిలీలు జరుగనున్నాయి.

కాగా జీఓ 317 పై ఇంకా క్లారిటీ లేకుండా బదిలీల ప్రక్రియ కొనసాగడం వల్ల దాదాపు మూడు వేల మంది ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇప్పటికీ దీనిపై ఓ కమిటీ వేసి చర్చించినా పూర్తిస్థాయిలో కొలిక్కిరాలేదు. స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల విభాగాలకు చెందిన బదిలీల్లో కొన్ని సమస్యలున్నాయి. అందుకే వీరి విషయంలో ప్రయార్టీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. డిఏ, పిఆర్సీ తదితర అంశాలపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోయినా బదిలీల విషయంలో మాత్రం నిర్ణయం తీసుకున్నందుకు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular