Thursday, April 10, 2025

కెనడాలో హైదరాబాద్ వాసి మృతి

కెనడాలో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ లోని మీర్ పేట్ కు చెందిన ప్రణీత్ సోమవారం అక్కడ ఓ ప్రమాదంలో మృతి చెందాడు. త‌న అన్న పుట్టిన రోజు సంద‌ర్భంగా స్నేహితుల‌తో క‌లిసి టోరంటోలోని లేక్ క్లియ‌ర్‌కు స్విమ్మింగ్‌కు వెళ్లిన అతను ఈత కొడుతూ ప్రమాద‌వ‌శాత్తూ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. దీంతో అతని స్నేహితులు ప్రణీత్​ త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించారు.

దీంతో ప్ర‌ణీత్ త‌ల్లిదండ్రులు రవి, సునీత, వారి కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. మృత‌దేహాన్ని వీలైనంత త్వ‌ర‌గా హైద‌రాబాద్‌కు తెప్పించాల‌ని ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నారు. కాగా రవి, సునితకు ఇద్దరు కుమారులు కాగా 2019లోనే వారిద్దరు కలిసి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయి మృతిచెందారు

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com