- అది మంజూరయితే విమానం ఎవరూ ఎక్కరు
- రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్ టు విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం కృషి చేస్తున్నానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సూపర్ గేమ్ ఛేంజర్‌గా రాష్ట్రానికి ఆర్‌ఆర్‌ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) వచ్చిందని దీంతో పాటు హైదరాబాద్ టు విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే సాధన కోసం గతంలో తాను ఎంపిగా ఉన్నప్పుడు ప్రయత్నించానని ఆయన వెల్లడించారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ టు విజయవాడ ఒక ఒక ఎక్స్‌ప్రెస్ హైవే పెట్టాలని, ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేను మంజూరు చేయించే ప్రయత్నంలో ఉన్నానని ఆయన అన్నారు. ఇది మంజూరయితే హైదరాబాద్ టు విజయవాడ ఎవరూ విమానం ఎక్కరని ఆయన తెలిపారు. కాగా, దేశంలో హైదరాబాద్‌ను రోల్ మోడల్ సిటీగా మారుస్తామని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో ఇంకెన్నో అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల కోసమే కాంగ్రెస్ పని చేస్తుందన్నారు.