Friday, November 15, 2024

హైదరాబాద్ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుంది

  • హెచ్‌ఎండిఏ పరిధిలో అమలుచేస్తున్న వివిధ ప్రాజెక్టులు, ప్రభుత్వ విధానాలను బాగున్నాయి
  • గుజరాత్ మాజీ డైరెక్టర్ కంట్రీ అండ్ టౌన్‌ప్లానింగ్ అధికారి పరేశ్‌శర్మ కితాబు
  • హెచ్‌ఎండిఏ రూపొందించే 2050 మాస్టర్‌ప్లాన్‌కు సలహాలు, సూచనలు

హైదరాబాద్ రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని, హెచ్‌ఎండిఏ పరిధిలో అమలుచేస్తున్న వివిధ ప్రాజెక్టులు, ప్రభుత్వ విధానాలను బాగున్నాయని గుజరాత్‌కు చెందిన డైరెక్టర్ కంట్రీ అండ్ టౌన్‌ప్లానింగ్ అధికారి పరేశ్‌శర్మ (రిటైర్డ్) కితాబునిచ్చారు. తెలంగాణ మున్సిపల్, హెచ్‌ఎండిఏ అధికారులు గుజరాత్ రాష్ట్రంలో అమలవుతున్న టౌన్‌ప్లానింగ్ విధానం గురించి తెలుసుకోవడానికి ఆ రాష్ట్రానికి చెందిన డైరెక్టర్ కంట్రీ అండ్ టౌన్‌ప్లానింగ్ అధికారి పరేశ్‌శర్మతో (రిటైర్డ్) భేటీ అయ్యారు.

మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన పరేశ్‌శర్మతో హెచ్‌ఎండిఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, ప్లానింగ్ డైరెక్టర్లు, విద్యాదర్, రాజేందర్ నాయక్, చీఫ్ ఇంజనీర్ పరంజ్యోతి తదితర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. గుజరాత్‌లో లే ఔట్‌లు, అపార్ట్‌మెంట్‌లకు ఇచ్చే అనుమతులతో పాటు అక్కడ అమలవుతున్న మాస్టర్‌ప్లాన్‌లకు గురించి పరేశ్‌శర్మను తెలంగాణ అధికారులు అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం ఇక్కడ అమలుచేస్తున్న విధానాల గురించి ఈసందర్భంగా హెచ్‌ఎండిఏ అమలుచేస్తున్న వివిధ ప్రాజెక్టుల గురించి అధికారులు పరేశ్‌శర్మకు వివరించారు. ముఖ్యంగా మాస్టర్‌ప్లాన్, జోనల్ విధానాలను, లే ఔట్ అనుమతులు, ల్యాండ్ పూలింగ్ వంటి వాటి గురించి పరేశ్‌శర్మ హెచ్‌ఎండిఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. హెచ్‌ఎండిఏ 2050 లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న నేపథ్యంలో అధికారులకు పరేశ్‌శర్మ కొన్ని సలహాలు, సూచినలు ఇచ్చారు. గుజరాత్‌లో కంట్రీ టౌన్‌ప్లానింగ్ విభాగం ఎంతో ప్రణాళికాబద్ధంగా వ్యవహారిస్తోందని హెచ్‌ఎండిఏ అధికారులతో పేర్కొన్నట్టుగా సమాచారం. ఈసందర్భంగా మున్సిపల్ శాఖ కార్యదర్శి దాన కిషోర్‌ను కూడా పరేశ్ శర్మ హెచ్‌ఎండిఏ అధికారులతో కలిసి సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రాజెక్టులను గురించి దానకిశోర్ కూడా ఆయనకు వివరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular