మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని సమాచారం. తెల్లవారుజామున అంజనాదేవిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. తల్లి అనారోగ్యం విషయం తెలిసి విజయవాడ నుంచి పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలో కార్యక్రమాలను, అధికారులతో సమీక్షలను రద్దు చేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, అంజనాదేవి అనారోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.