గ్రేటర్ హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపిస్తున్న హైడ్రా సినీ నటుడు నాగార్జునకు సంబందించి ఎన్ కన్వెన్షన్ పై దృష్టి సారించింది.
మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం ఈ ఉదయం నుంచి కూల్చి వేస్తోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కు సంబందించిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఖానామెట్ లోని తుమ్మిడి కుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి.
హీరో నాగార్జున తుమ్మిడి కుంట చెరువులోని మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఇక తుమ్మిడి కుంట చెరువు ఎఫ్ టీఎల్ లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని గతంలో సైతం అనేక ఆరోపణలు వచ్చాయి.
ఎట్టకేలకు రంగంలోకి దిగిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాలను కూల్చి వేస్తుంది. కూల్చివేతల నేపధ్యంలో మాధాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసి వేశారు. ఇరువైపులా భారీకేట్లు ఏర్పాటు చేసి భారీ భద్రత ఏర్పాటు చేశారు.