Sunday, November 10, 2024

హైడ్రా కూల్చివేతలు పెట్రోల్ పోసుకుని ఇద్దరు హల్ చల్!

కూల్చివేతలకు కాస్త బ్రేక్ ఇచ్చిన హైడ్రా అధికారులు మళ్లీ డ్యూటీ ఎక్కారు. సెప్టెంబర్ 08 ఆదివారం ఉదయం మాదాపూర్ సున్నం చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఎఫ్‌టీఎల్‌లోని సర్వే నంబర్లు 12, 13, 14, 16లో కబ్జాదారులు పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఈ క్రమంలో ఘటనా స్థలంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

పెట్రోల్ పోసుకుని ఓ ఇద్దరు వ్యక్తులు హల్ చల్ చేశారు. వెంటనే అలెర్ట్ అయిన మాదాపూర్ పోలీసులు వారిపై నీళ్ళు పోసి అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ మహిళ కూడా ఉన్నారు. ఇందులో మాల వేసుకున్న ఓ వ్యక్తి మీద పోలీసులు బూతు పురాణంతో రెచ్చిపోయారు. అతని బట్టలు ఊడిపోతున్నా లాక్కొని మరీ అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular