ఏం కావాలో కొనుక్కోండి- హైడ్రాకు రూ. 50 కోట్లు
హైడ్రాకు నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రాకు రూ. 50 కోట్లు విడుదలయ్యాయి. కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు ఈ నిధులను వినియోగించుకోవాలని పురపాలక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైడ్రాకు ప్రత్యేకంగా బడ్డెట్ కేటాయించే అంశాన్ని పరిశీలించాలని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలన్నారు. హెచ్‌ఎండీఏ, వాటర్ వర్క్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మునిసిపల్ విభాగాల మధ్య సమన్వయం ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. అనధికారిక హోర్డింగుల తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యతలను జీహెచ్‌ఎంసీ నుంచి హైడ్రాకు బదలాయించాలని ఆదేశించారు. చెరువుల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినంగా ఉండేలా అధ్యయనం చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించారు.