Friday, April 18, 2025

తగ్గేదేలే ..! ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి హైడ్రా నోటీసులు

హైదారాబాద్ లో హైడ్రా దూకుడుగా వెళ్తుంది. అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టిన సరే.. తగ్గేదేలే అన్నట్టుగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేసిన హైడ్రా అధికారులు నిన్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చారు. మాదాపూర్ దుర్గం చెరువు ఏరియాపై ఫోకస్ చేసిన హైడ్రా.. చెరువును ఆనుకొని కట్టిన కావూరి హిల్స్, సెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇందులో పలువురు పలువురు ఐఏఎస్, ఐఆర్‌ఎస్‌ , సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నట్లు సమాచారం.

ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఇళ్లు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. దుండిగల్‌లోని MLRIT, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపించారు. చిన్నదామర చెరువు FTL, బఫర్ జోన్ పరిధిలో ఈ నిర్మాణాలు చేపట్టారని, దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com