బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీనివాస ఎంక్లేవ్, శ్రీ హర్షిత కాలనీల మధ్య గల ప్రహరీ గోడను హైడ్రా అధికారులు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర టౌన్ ప్లానింగ్ అధికారుల సహకారంతో సోమవారం కూల్చివేశారు.
ఈ సందర్భంగా కార్పొరేషన్ కమిషనర్ మాట్లాడుతూ.. రెండు కాలనీల మధ్య ఇంటర్నల్ కనెక్టివిటీ కోసం ఈ కూల్చివేతలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేష్, డిప్యూటీ ఈఈ జి యాదయ్య, ఏఈఈ వి రాజ్ కుమార్, టిపిఎస్ జీ వాని, శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.