Saturday, May 3, 2025

హైడ్రా పోలీస్ స్టేషన్‌ రెడీ ఈ నెల 8న ప్రారంభించనున్న సీఎం

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చి హైడ్రా.. హైదరాబాద్ నగరంలో సంచలనంగా మారడంతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయాలనే భారీ డిమాండ్ ఏర్పడింది. అక్రమ కట్టడాలను నేల కూల్చడమే లక్ష్యంగా, చెరువులు, పార్క్‌లో, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ద్యేయంగా పని చేస్తున్న హైడ్రాకు ప్రభుత్వం మరిన్ని అధికారాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు గతంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. కాగా ఈ నెల 8న హైడ్రా పోలీస్ స్టేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఇకపై హైడ్రా పోలీస్ స్టేషన్లలో స్థానికులు, అధికారుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేయనున్నారు. ప్రస్తుతం సాధారణ పోలీస్ స్టేషన్‌లలో నమోదు అయిన భూకబ్జా కేసులపై హైడ్రా చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే సాధారణ పోలీస్ స్టేషన్‌ల నుంచి హైడ్రా పోలీస్‌ స్టేషన్‌కు కేసులు బదిలీ అయ్యే ఛాన్స్ ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com