కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూల్చివేయమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. కొత్త నిర్మాణాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని కూలుస్తున్నట్లు తెలిపారు. రంగనాథ్ ప్రకటనతో ఇప్పటికే ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వారికి భారీ ఊరట లభించనుంది.