Friday, January 31, 2025

హిమాచల్‌తో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు

విద్యుత్ సామర్థ్యం పెంపులో తెలంగాణ స‌ర్కారు మరో ముందడుగు
హిమాచల్ ప్రదేశ్‌లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై రాష్ట్ర‌ ప్రభుత్వం ఆసక్తి
బూట్ విధానంలో ప్రతిపాదనలు ఆహ్వానించిన హిమాచల్ ప్రభుత్వం
ఎంవోయూ  పంపాల్సిందిగా హిమాచల్ సీఎంను కోరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

 రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. డిప్యూటీ సీఎంఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచనలతో రాష్ట్ర అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బూట్ (బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫ‌ర్‌ ) విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఆహ్వానించగా.. తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ శాఖ అధికార బృందం హిమాచల్ ప్రదేశ్‌ను సందర్శించిఆ ప్రతిపాదనను అధ్యయనం చేసి 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తి వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఎంవోయూ పై సంతకం చేసి త్వరితగతిన పంపితే తగు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఇందుకు సంబంధించి గురువారం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ వింధర్ సింగ్ సఖుతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు దిల్లీలో సమావేశమ‌య్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బూట్ విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై ప్రతిపాదనలను ఆహ్వానించిన నేపథ్యంలోతెలంగాణ ప్రభుత్వ విద్యుత్ శాఖకు చెందిన అధికారి బృందం హిమాచల్ ప్రదేశ్‌ను సందర్శించింది. ఈ సందర్భంగావారు హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ శాఖ కార్యదర్శితో సమావేశమై చర్చలు జరిపారు. అలాగే, SELI హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు (400 మెగావాట్లు)మియ‌ర్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు (120 మెగావాట్లు) ప్రాంతాలను పరిశీలించారు. తమ అధ్యయనంలో, 100 మెగావాట్లకు పైబడి సామర్థ్యం గల ప్రాజెక్టులపై ఆసక్తి వ్యక్తం చేయాలని సిఫారసు చేశారు.

ఈ నేపథ్యంలో గురువారం ఉదయం దిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లువిద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తో కలిసిహిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ వింధర్ సింగ్ తో సమావేశమయ్యారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారుల సమక్షంలోతెలంగాణ ప్రభుత్వం సెలి (400 మెగావాట్లు)మియ‌ర్‌ (120 మెగావాట్లు) హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా అధికారికంగా ఒక లేఖను సమర్పించింది.

ఈ సందర్భంగా అవ‌గాహ‌న‌ ఒప్పంద‌ ముసాయిదాను పంపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హిమాచల్ ప్రదేశ్ సీఎం కోరారు. ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం తగిన పరిశీలన చేసిన అనంతరం త్వరితగతిన ఎంవోయూపై సంతకం చేసే విధంగా చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేయబడుతుంది. ఫలితంగా ప్రస్తుత రాష్ట్ర అవసరాలు మరియు భవిష్యత్ విద్యుత్ డిమాండ్లను తీర్చేందుకు విద్యుత్ సరఫరా సామర్థ్యం మరింత బలపడేందుకు ఉపయోగపడుతుంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com