Friday, January 10, 2025

స్కూల్‌ వయసులోనే చాలా ట్రోల్స్‌ ఎదుర్కొన్నా

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు అవ్వడంతో జాన్వీ కపూర్ హీరోయిన్ అవ్వక ముందు నుంచే సెలబ్రిటీ అనే విషయం తెల్సిందే. జాన్వీ కపూర్‌ స్కూల్‌ లో చదువుతూ ఉన్నప్పటి నుంచే చాలా మంది శ్రీదేవి మరియు బోనీ కపూర్‌ లను మీ పాపను హీరోయిన్ గా చేస్తారా అంటూ అడిగేవారట. మీడియాలో జాన్వీ కపూర్‌ మరియు ఖుషి కపూర్ ల ఫోటోలు రెగ్యులర్ గా వస్తూ శ్రీదేవి కిడ్స్ అంటూ కథనాలు వచ్చేవి. సాధారణంగా సెలబ్రిటీలు ఎదుర్కొనే ఎన్నో ఇబ్బందులను జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ అవ్వక ముందే ఎదుర్కొందట.

తన బాడీ షేమింగ్ మొదలుకుని ఎన్నో విషయాల గురించి స్కూల్‌ ఏజ్‌ లోనే ట్రోల్స్ ఎదుర్కొన్నాను అంటూ జాన్వీ కపూర్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. హిందీలో ఈమె నటించిన మహీ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిన్నతనంలో తాను ఎదుర్కొన్న ట్రోల్స్ గురించి చెప్పుకొచ్చింది. ముఖ్యంగా తాను స్కూల్‌ లో ఉన్న సమయంలోనే కొందరు నా ఫోటోను మార్ఫింగ్ చేసి పో ర్న్‌ సైట్‌ లో పెట్టారట. దాంతో నా స్నేహితులు గేలి చేసేవారు. అప్పుడే ట్రోల్స్ ను ఎదుర్కోవడం మొదలు పెట్టాను. నన్ను ఏదో విషయం చూపించి విమర్శించే వారి గురించి ఎక్కువ ఆలోచించి నా పనిని నేను వదిలేయను.

వారి విమర్శలు పట్టించుకోకుండా నేను ఏం చేయాలో అదే చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను అంది. జాన్వీ కపూర్‌ ఇప్పటికి కూడా సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఏదో ఒక విషయంలో ట్రోల్స్ ను ఎదుర్కొంటూనే ఉంటుంది. అయితే వాటిని తాను పట్టించుకోను అంది. కానీ తన కుటుంబ సభ్యుల గురించి ఎవరైనా, ఏమైనా ట్రోల్‌ చేస్తే మాత్రం తట్టుకోవడం నా వల్ల కాదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com