Wednesday, June 26, 2024

క్లీంకారకు నేను తినిపించడం ప్రారంభిస్తే…

గిన్నె ఖాళీ అవాల్సిందే: రామ్ చరణ్

ఇవాళ ఫాదర్స్ డే. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. తన కుమార్తె క్లీంకారతో గడిపే సంతోషకర క్షణాలను ఆయన పంచుకున్నారు. క్లీంకార ఇప్పుడిప్పుడే తమను గుర్తిస్తోందని వెల్లడించారు. సినిమా షూటింగ్స్ కు వెళ్లినప్పుడు కుమార్తెను ఎక్కువగా మిస్సవుతుంటానని తెలిపారు. తన కుమార్తె స్కూల్లో చేరేంత వరకైనా ఆమెతో అధిక సమయం గడిపేలా తదుపరి సినిమాల షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటానని అన్నారు.

ఇక, క్లీంకారకు అన్నం తినిపించడం తనకు చాలా ఇష్టమని రామ్ చరణ్ మురిసిపోతూ చెప్పారు. రోజుకు రెండుసార్లయినా తినిపిస్తుంటానని, తాను తినిపిస్తుంటే గిన్నె ఖాళీ అవాల్సిందేనని, ఈ విషయంలో నేనే చాంపియన్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. క్లీంకారకు అన్నం తినిపించే సమయంలో తనలో మానవాతీత శక్తులు ప్రవేశించినట్టుగా భావిస్తానని చమత్కరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?

Most Popular