Saturday, May 17, 2025

అప్పుడు తెలియక తప్పు చేశాను

సమంత హీరోయిన్‌గా ఈ అమ్మడు సంపాదించుకున్న స్టార్‌డమ్‌ మాములుది కాదు. కెరీర్‌ తొలినాళ్ల నుంచి వరుస విజయాలను అందుకుంది. అగ్ర హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది. అనంతరం నాగ చైతన్యతో వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాలను కొనసాగించింది. హీరోయిన్‌గా వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సమయంలోనే నాగ చైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిట్‌ వ్యాధి బారిన పడింది. దీంతో సినిమాలకు చాలా గ్యాప్‌ ఇచ్చింది సామ్‌. ప్రస్తుతం సామ్‌ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అయితే ఇటీవలే ఓ వెబ్‌ సిరీస్‌కు ఈ బ్యూటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే సినిమాలు లేకపోయినా సోషల్‌ మీడియా ద్వారా నిత్యం అభిమానులతో టచ్‌ ఉండే సామ్‌, ఫ్యాన్స్‌ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. గతంలో తాను ఓ విషయంలో తెలియక తప్పు చేశానని చెప్పుకొచ్చింది. గతంలో సమంత కొన్ని అనారోగ్యకరమైన బ్రాండ్స్‌ని ప్రమోట్‌ చేసిన విషయమై అభిమాని ప్రశ్నించాడు. దీనికి బదులిచ్చిన సమంత.. గతంలో తాను తప్పులు చేసిన మాట వాస్తవమేనని, అయితే అన్నవీ పూర్తిగా తెలియక చేసినవని చెప్పుకొచ్చారు. అయితే అసలు విషయం తెలుసుకున్న తర్వాత ప్రమోషన్స్‌ చేయడం ఆపేశానని తెలిపారు. ఇప్పుడు తాను ఏం చేస్తుందో వాటి గురించి మాత్రమే చెబుతున్నాని సమాధానం ఇచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com