Thursday, May 15, 2025

నేను ఆయన పెళ్ళాన్నే

ఏ. ఆర్‌ రెహమాన్‌ ఆనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని వైద్యులు తెలిపారు. ఆనయ అనారోగ్యానికి గురయ్యారు అని తెలియగానే ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అదే స‌మ‌యంలో అత‌డి సోద‌రుడు, కుమారుడు, భార్య‌ కూడా స్పందించారు. లండ‌న్ నుంచి చెన్నైకి తిరిగి వచ్చిన రెహ‌మాన్ అల‌స‌ట‌, డీ హైడ్రేష‌న్ కార‌ణంగా ఆస్ప‌త్రిలో చేరారు. వైద్య ప‌రీక్ష‌ల త‌ర్వాత అత‌డికి ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని ధృవీక‌రిస్తూ చెన్నైలోని ఆస్ప‌త్రి వ‌ర్గాలు బులెటిన్ విడుద‌ల చేసాయి. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే రెహ‌మాన్ గుండె నొప్పితో ఆస్ప‌త్రిలో చేరార‌ని ఒక సెక్ష‌న్ మీడియా అప్ప‌టికే వార్త‌ల్ని ప్ర‌చారం చేసింది. దీనిని ఖండిస్తూ, రెహమాన్ సోదరి ఏఆర్ రెహానా కూడా ఛాతీ నొప్పి కారణంగా అతను ఆసుపత్రిలో చేరాడనే పుకార్లను తోసిపుచ్చింది. ఇది ప్రయాణ అలసట వల్ల ఏర్పడిన డీహైడ్రేషన్ మాత్రమేన‌ని ధృవీకరించారు. రెహ‌మాన్ కుమారుడు ఏ.ఆర్ అమీన్ సోషల్ మీడియాలో తన తండ్రి బాగా కోలుకుంటున్నారని అభిమానులకు హామీ ఇచ్చాడు. వారి ప్రార్థనలు, మద్దతుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తాజాగా రెహమాన్ భార్య సైరా భాను మీడియా క‌థ‌నాల‌కు స్పందించారు. తాను ఇంకా మాజీ భార్య‌ను కాలేద‌ని, తాము కేవ‌లం విడిగా ఉంటున్నాము త‌ప్ప‌, విడాకులు తీసుకోలేద‌ని వివ‌రించారు. దూరంగా ఉంటున్నా, ఇప్పటికీ చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యాభ‌ర్త‌ల‌మేన‌ని కూడా సైరా భాను అన్నారు. విడాకుల కోసం దాఖలు చేయలేదని ఆమె స్పష్టం చేసింది. తన అనారోగ్య సమస్యల కారణంగా రెహమాన్ కు అదనపు ఒత్తిడి కలగకూడదని, అందుకే తాను విడిగా జీవించాలని నిర్ణయించుకున్నానని సైరా వివరించింది. రెహ‌మాన్ క్షేమంగా ఉండాల‌ని తాను ప్రార్థిస్తున్నాన‌ని కూడా అన్నారు. మాజీ భార్య అని పిలవడం మానేయాలని మీడియాను కోరానని కూడా సైరా చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com