Thursday, December 26, 2024

నేను రెడీ

సిట్టింగ్ జడ్డితో విచారణ చేయించండి =మీడియా చిట్ చాట్‌లో కేటీఆర్

ఔటర్ రింగ్ రోడ్డు టోల్ కాంట్రాక్టు వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. దీనిపై నిజాలు నిగ్గు తేల్చాలంటే సిట్టింగ్ జడ్జితోకానీ.. రిటైర్డ్ జడ్జితో కానీ నిష్పాక్షిక విచారణ జరగాలని కోరారు. శుక్రవారం అసెంబ్లీకి వచ్చిన ఆయన, మీడియాతో చిట్ చాట్ చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులు నుంచి డబ్బులు సేకరిస్తున్న టీవోటీ విధానంలో తాము డబ్బులను సేకరించామన్నారు. ప్రయివేట్ కంపెనీకి లబ్ది చేకూర్చినట్టు ఆరోపిస్తున్న ప్రభుత్వం, ఆ కంపెనీతో లీజుని ఎందుకు రద్దు చేయలేదన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖ ఉందని, ఇలాంటి సందర్భంలో సిట్ ద్వారా వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ విధానం దేశంలో ఇప్పటికే అమలులో ఉందన్నారు. దాని నుంచి వచ్చిన డబ్బులను రైతు రుణమాఫీకి ఉపయోగించామన్నారు. ఆర్థిక వనరుల సమీకరణపై అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ అనేక సూచనలు చేసిందన్నారు కేటీఆర్. అమెరికా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి డబ్బులు సేకరించవచ్చన్నారు. మాపై ఆరోపణలు చేసి కక్ష సాధింపులకు పరిమితం కాకుండా వాస్తవాలు తెలిసేలా మాట్లాడాలన్నారు. పది వేల కోట్ల రూపాయల కోకాపేట కుంభకోణం అంటున్న భూముల అమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com