Friday, April 4, 2025

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సి.సుదర్శన్ రెడ్డి

వికాస్‌రాజ్‌ను రిలీవ్ చేసిన ఇసి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సిఇఒ)గా సి.సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు వెలువరించింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ఉన్నారు. సిఇఒ పోస్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురి పేర్లను పంపించగా, 2002 బ్యాచ్ ఐఎఎస్ అధికారి సుదర్శన్ రెడ్డిని సిఇసి ఎంపిక చేసింది.

ప్రస్తుత సిఇఒ వికాస్‌రాజ్ కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి రిలీవ్ చేసింది. వికాస్‌రాజ్‌కు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వనుంది. అదనపు సిఇఒలుగా విధులు నిర్వహించి రిలీవ్ అయిన ఐఎఎస్ అధికారులు లోకేశ్‌కుమార్‌ను పంచాయతీ రాజ్ కార్యదర్శిగా, సర్ఫరాజ్ అహ్మద్‌ను హెచ్‌ఎండిఎ కమిషనర్‌గా ప్రభుత్వం ఇటీవలే కీలక బాధ్యతల్లో నియమించింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com