ఫాస్టాగ్ సరిగా అతికించకపోయినా, ఫాస్టాగ్ లేకపోయినా
ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించే వాహనాలకు రెండు రెట్ల ఫీజు వసూల్
అమల్లోకి వచ్చిన నిబంధనలు
ఫాస్టాగ్ సరిగా అతికించకపోయినా, ఫాస్టాగ్ లేకపోయినా ఓఆర్‌ఆర్ రెండు రెట్ల టోల్ ఫీజు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం సర్యులర్ జారీ చేయడంతో ఇది ఓఆర్‌ఆర్ ప్రయాణించే వాహనాలకు వర్తించనుంది. ఇప్పటికే నేషనల్ హైవేపై ప్రయాణించే వాహనాలకు వర్తిస్తుండగా ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించే వాహనాలకు కూడా అమలు చేయాలని హెచ్‌ఎండిఏ నిర్ణయించింది.
ఫాస్టాగ్‌ను తమ వాహనాలకు సరిగ్గా అతికించుకోవాలని ఓఆర్‌ఆర్ టోల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంస్థ సూచించింది. ఓఆర్‌ఆపై మొత్తం 21 టోల్ ప్లాజాలు ఉన్నాయని, ఆ టోల్‌ప్లాజాల మీదుగా ప్రయాణించే వాహనాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆ సంస్థ తెలిపింది. ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించే వాహనదారులు ఐహెచ్‌ఎంసీఎల్ సూచనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించి, రెట్టింపు టోల్ ఫీజు లేకుండా, ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ లేకుండా చూసుకోవాలని సూచించింది.