- 155313 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి
- రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
త్రాగునీటి సమస్యపై ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలో ఎక్కడ నీటి ఎద్దడి ఏర్పడినా 155313 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయాలని హైదరాబాద్ ఇన్‌చార్జీ మంత్రి, రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి వేసవిలో నీటి ఇబ్బంది నెలకొందన్నారు.
గతంలో హైదరాబాద్ నీటి అవసరాలకు 2300 ఎంఎల్‌డి ఇప్పుడు 2,450 ఎంఎల్‌డి నీరు సరఫరా చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో 700 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, సింగూర్‌లో నీటి నిలువలు ఉన్నాయని, అయినా ప్రతిపక్షాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ నీటిని విడుదల చేస్తున్నామన్నారు.