గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వాష్ రూములలో హిడెన్ కెమెరాల ఆరోపణలపై పోలీసు బృందాల దర్యాప్తు అప్డేట్స్ పై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్. కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదు.
క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఢిల్లీ టీం సేవలు వినియోగించాం. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేసాం. కళాశాల వ్యవహారంపై ముగ్గురు ఐజీలు దర్యాప్తు చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా పోలీసుల విచారణ జరిగింది.
ఐజి అశోక్ కుమార్ కామెంట్స్
హాస్టల్ వాష్ రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశాం. విద్యార్థులు, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు బృందాల సమక్షంలో ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్ రూముల్లో తనిఖీలు చేశాం.వాష్ రూమ్ ల, షవర్లలో ఎటువంటి కెమెరాలు గుర్తించలేదు.విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించాం.
విచారణలో కెమెరాలు, కానీ ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరు చెప్పలేదు.కెమెరాల ఏర్పాటు, వీడియోలు అంశం ఎవరో చెప్తేనే తమకు తెలిసిందనీ విచారణలో అందరూ చెప్పారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లను స్వాధీనం చేసుకున్నాం.ఏపీలో క్రిమినల్ కేసుల్లో తొలిసారిగా CERT సేవలు.