Sunday, November 17, 2024

ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలం

సీఐలు, ఎస్‌ఐలపై వేటు వేసిన ఐజీ

మల్టీజోన్‌-2లోని తొమ్మిది జిల్లాల పరిధిలో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడంలో విఫలమైన పోలీసులపై ఐజీ వీ సత్యనారాయణ చర్యలు చేపట్టారు. ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్‌ఐలను వీఆర్‌లో పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఓ సీఐ, 14 మంది ఎస్‌ఐలను బదిలీ చేశారు. తాజాగా సంగారెడ్డి రూరల్‌, తాండూరు రూరల్‌, తాండూర్‌ టౌన్‌ సీఐలతో పాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్(S), పెన్ పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్‌ఐలను వేకెన్సీ రిజర్వ్‌లో పెట్టారు. కొందరు అధికారులకు ఇసుక రవాణాలో ప్రత్యక్ష, పరోక్ష సహకారం ఉందని.. ఈ క్రమంలో వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో వీరందరినీ లూప్‌లైన్‌కు బదిలీ చేయనున్నట్లు చెప్పారు.

ఇప్పటికే అడవిదేవీపల్లి, వేములపల్లి, నార్కట్‌పల్లి, చండూర్, మాడుగులపల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట్, బొంరాస్‌పేట్, తాండూర్, చిన్నంబావి ఎస్‌లను బదిలీ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వ ఆదాయానికి గండిపతుతుందని.. వాగులు, నిషేధిత నదీ ప్రాంతాల్లో విచక్షణా రహితంగా ఇసుకను తవ్వితే పర్యావరణ సమత్యులతకు భంగం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వంతో పాటు డీజీపీ అక్రమ రవాణాపై సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు ఇసుక అక్రమ రవాణాకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సిందేనన్నారు. అలాగే ఇసుక అక్రమ రవాణా వసూళ్లకు పాల్పడిన కొండమల్లేపల్లి హోంగార్డ్‌, జడ్చర్ల కానిస్టేబల్‌ను డీఏఆర్‌కి అటాచ్‌ చేసినట్లు చెప్పారు. వీటితో పాటు పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమ రవాణా చేసినా చర్యలుంటాయన్నారు. బాధ్యతాయుతమైన సర్కిల్‌ ఇన్‌స్పెకర్‌గా పని చేస్తూ ఓ మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో అలసత్యం వహించిన, దర్యాప్తులో అవకతవకలకు పాల్పడిన వికారాబాద్‌ టౌన్‌ సీఐ ఏ నాగరాజును సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular