Monday, January 6, 2025

ఇక మీదట ఐదు రోజుల్లోనే పాస్ట్ పోర్ట్

పాస్‌పోర్ట్‌ కష్టాలు తీరనున్నాయి. రోజుల తరబడి వెయిట్‌ చేసే పరిస్థితులకు బ్రేక్‌ వేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న ఐదురోజుల్లోనే పాస్ పోర్ట్ వచ్చేయనుంది. దాంతో పాటూ తత్కాల్ పాస్ పోర్ట్ ఒక్క రోజులోనే అందిస్తామని సికింద్రాబాద్​ రీజినల్​ పాస్ పోర్ట్ సెంటర్ ​డైరెక్టర్​ స్నేహజ తెలిపారు. రీజినల్​పాస్​పోర్ట్ ఆఫీసులో యాన్యువల్ ​రిపోర్టును విడుదల చేశారు. పాస్‌పోర్ట్‌ల విషయంలో హైదరాబాద్ విశేష అభివృధి సాధించింది. గతేడాది 9 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 7.85లక్షల మందికి పాస్‌పోర్టులు అందాయి. ఇది మరింత అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తున్నామని సికింద్రాబాద్​ రీజినల్​ పాస్ పోర్ట్ సెంటర్ ​డైరెక్టర్​ స్నేహజ చెప్పారు. ఇందులో భాగంగా ఇక మీదట దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లోనే పాస్‌పోర్ట్ అందిస్తామని తెలిపారు. అలాగే తత్కాల్ పాస్పోర్ట్ ఒక్కరోజులోనే ఇచ్చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రీజినల్ ​పాస్​పోర్టు ఆఫీసు పరిధిలో ఐదు పాస్​పోర్ట్ ​సేవా కేంద్రాలు,14 పోస్ట్​ఆఫీస్ పాస్​పోర్టు సేవా కేంద్రాలు పని చేస్తున్నాయని స్నేహజ తెలిపారు.

వాట్సాప్ నంబర్
పాస్ పోర్ట్ రూల్స్ కూడా మారిపోయాయి. ఇంతకు ముందు పాస్ పోర్ట్ ఇష్యూ చేసే ముందు చేసే పోలీస ఇంక్వైరీ డైరెక్ట్‌గా ఉండేది. కానీ ఇప్పుడు అది ఆన్‌లైన్లో జరుగుతోంది. ఇక మీదట కూడా దాన్నే కొనసాగిస్తామని స్నేహజ తెలిపారు. పాస్​పోర్టు సేవలు మరింత చేరువ చేసేందుకు కొత్తగా మొబైల్​ పాస్​పోర్టు సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. అలాగే దరఖాస్తు దారుల నుంచి పెరుగుతున్న డిమాండ్​ కు అనుగుణంగా వరంగల్, ఖమ్మం, వికారాబాద్, మేడ్చల్, మహబూబాబాద్, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్​ లలో అపాయింట్​మెంట్ల సంఖ్యను పెంచామని ఆమె చెప్పారు. దాంతో పాటూ ఆస్ట్ పోర్ట్ అప్లైలో సమస్యలు ఉన్నవారు సత్వర పరిష్కారం కోసం ప్రత్యేకంగా 8121401532 నంబరుతో వాట్సాప్​ ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ నంబర్‌‌కు వాట్సాప్ చేసిన ఫిర్యాదులకు వెంటనే పరిష్కార మార్గాలు చూపుతామని తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com