ప్రభుత్వ భూము లను అక్రమంగా కబ్జా చేసే అక్రమా ర్కుల ఆటలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర సర్కారు పటిష్టమైన ప్రణా ళికను అమలు చేస్తోంది .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హౌసింగ్ బోర్డు, డెక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ( దిల్) భూముల పరిరక్షణకు ప్రభు త్వం ద్విముఖ వ్యూహాన్ని అవలం బిస్తోంది. ఒకవైపు ఉన్న భూము లను పరిరక్షిస్తూనే మరోవైపు గతంలో ఆక్రమణలకు గురైన భూములను తిరిగి దక్కించుకునేందుకు నడుం బిగించింది. అలాగే ఈ దిశగా ఇప్పటికే చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
అల్పాదాయ, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకు ఇళ్లు నిర్మించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హౌసింగ్ బోర్డును ఏర్పాటు చేసింది. హౌసింగ్ బోర్డు, దిల్ పరిధిలో వేల ఎకరాల భూములు ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలోనే ఐదు వందల ఎకరాల వరకూ ఉన్నాయి.గతంలో జాయింట్ వెంచర్ కింద వివిధ సంస్ధలకు కేటాయించిన భూములను ఆయా సంస్ధలు నిబంధనల మేరకు వినియోగించని భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది.
గతంలో సరైన పర్యవేక్షణ, పరిరక్షణ లేక పలుచోట్ల హౌసింగ్ బోర్డు భూములు ఆక్రమణలకు గురయ్యాయి. భూముల ధరలు భారీగా పెరుగుతుండడం, కబ్జాకు గురి కావడం, కోర్టులలో కేసులు ఇలా అనేక సమస్యలు, వివాదాల నేపథ్యంలో వాటిని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
భూములను ఆక్రమణల నుంచి కాపాడుకోవడానికి దాదాపు రూ.25 కోట్లతో ప్రహరీ గోడలను నిర్మిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ హౌసింగ్ బోర్డు 20 జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ లను చేపట్టింది. ఇందులో 14 ప్రాజెక్ట్ లు పూర్తి కాగా మిగిలిన ప్రాజెక్ట్ లు కోర్టు కేసుల్లో ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూముల పరిరక్షణతోపాటు కోర్టు కేసులలో ఉన్నప్రాజెక్టుల్లో ప్రభుత్వవాదనలు బలంగా వినిపించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలతో వేల కోట్ల రూపాయిల విలువ చేసే 18 ఎకరాల భూములను రెండు సంస్ధల నుంచి స్వాధీనం చేసుకుంది.
ఆర్బిట్రేషన్ అవార్డును అనుసరించి ఇందు ఈస్ట్రన్ ప్రావిన్స్ ప్రాజెక్ట్ లిమిటెడ్, బండ్లగూడకు సంబంధించిన ఒప్పందం మేరకు అభివృద్ధి చేయని, ఎల్‌ఐజి గృహాలు నిర్మించనందున ఇందుకు సంబంధించిన 10.41 ఎకరాల స్థలాన్ని స్వాధీనపరచుకోవడమే కాకుండా భవిష్యత్ లో కబ్జాకు గురికాకుండా ప్రహరీని నిర్మించారు. అలాగే మధుకాన్ ప్రాజెక్ట్ నుంచి 7.32 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. యూనివర్సల్ డెవలపర్స్ గచ్చిబౌలి , కూకట్‌పల్లిలో ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ ద్వారా హౌసింగ్ బోర్డుకు ఎంతో కాలంగా రెవెన్యూ వాటా కింద రావాల్సిన రూ.589 కోట్లకు గాను గత ఏడాది రూ.45 కోట్లు వసూలు చేసింది. హౌసింగ్ బోర్డు, దిల్ కు సంబంధించిన ఖాలీ స్థలాలకు జియోట్యాగింగ్ చేసి విలువైన భూములను కాపాడేందుకు చర్యలు తీసుకుంటోంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఖాలీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఓపెన్ ల్యాండ్స్ కోసం డిజిపిఎస్ సర్వే నిర్వహించడమేగాక భూములను జియో ట్యాగ్ చేసింది. హౌసింగ్ బోర్డుకు చెందిన 703 ఎకరాల ఖాళీ స్థలాలకు జి.పి.ఆర్.ఎస్ సర్వే నిర్వహించింది.
హౌసింగ్ బోర్డుకు చెందిన 410 ఎకరాల భూములకు 18 ప్యాకేజీల కింద రూ.10కోట్ల రూపాయిల విలువైన టెండర్లు పిలిచి పనులు చేపట్టగా ఇప్పటికి కాంపౌండ్ వాల్స్ దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. అదేవిధంగా దిల్‌కు సంబంధించిన 943.52 ఎకరాల భూములకు 15 ప్యాకేజీల కింద రూ.10 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్రహరీలు ఈ ఏడాది జూన్ నెలాఖరులోగా పూర్తి కానున్నాయి. అంతేగాక భూముల రక్షణకు సిసి కెమెరాలతో పాటు, సెక్యూరిటీ గార్డుల నియామకం ద్వారా గట్టి చర్యలు తీసుకుంటుంది. రానున్న కాలంలో సిసిటీవీలను కూడా శాటిలైట్ మానిటరింగ్ సిస్టమ్‌తో అనుసంధానించడానికి చర్యలు తీసుకోనున్నారు. హౌసింగ్ బోర్డు ఖాలీ స్థలాల ప్రహరీ గోడల నిర్మాణానికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇప్పటివరకు 28,499 రన్నింగ్ మీటర్ల ప్రహరీ నిర్మాణం వివిధ దశలలో ఉంది.
భూముల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హౌసింగ్ బోర్డు ఆధీనంలోని భూములను చట్టవిరుద్దంగా ఆక్రమించిన వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వానికి సంబంధించిన గజం స్ధలం కూడా ఆక్రమణకు గురికాకుండా మా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. హౌసింగ్ బోర్డ్ , దిల్ ఆధీనంలో వేల కోట్ల రూపాయిల విలువచేసే భూములు ఉన్నాయి. ఈ భూముల పరిరక్షణకు తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. హౌసింగ్ బోర్డు భూములను జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ కింద గతంలోని ప్రభుత్వాలు ప్రైవేటు సంస్ధలకు అప్పగించాయి. కానీ నిబంధనల ప్రకారం వినియోగించని భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాం.