Tuesday, May 13, 2025

నేను జియో కస్టమర్‌నే.. నన్నెందుకు పెళ్లికి పిలవలా?

అంబాని ఇంట పెళ్లి… ఈ విషయం గత కొన్ని రోజులుగా వింటూనే ఉన్నాం. వీళ్ళు చేసే హడావిడి అంతా కూడా ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాల ద్వారా అందరం తెలుసుకుంటూనే ఉన్నాం. అప‌ర‌కుబేరుడు ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ఎంత గ్రాండ్ గా చేసారో తెలిసిందే. అంబానీ ఇంట పెళ్లికి ప్ర‌పంచ‌మే నివ్వెర పోయింది. హాలీవుడ్ నుంచి బాలీవుడ్… టాలీవుడ్.. కోలీవుడ్ ఇలా అన్ని ఉడ్ ల నుంచి సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు.

వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ సింగ‌ర్లు సైతం ఈ వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇంకా వ‌ర‌ల్డ్ బిజినెస్ దిగ్గ‌జాలు, పారిశ్రామిక వేత్తులు, రాజ‌కీయ నాయ‌కులు, ముఖ్య‌మంత్రులు ఇలా ఎంతో మంది విచ్చేసారు. వారం ప‌ది రోజులు కాదు ఏకంగా ప్రీవెడ్డింగ్ వేడుక‌లే ఐదు నెల‌లు జ‌రిగాయి. ఇక మూడు రోజుల పెళ్లి ఘ‌ట్టం ఎలా జ‌రిగిందో తెలిసిందే. ఇక నుంచి పోస్ట్ వెడ్డింగ్ వేడుక‌లు జ‌రుగుతున్నాయి. ప్రస్తుతం అనంత్ అంబానీ-రాధికా మ‌ర్చెంట్ లో హ‌నీమూన్ లో ఉన్నారు. ఇలా పెళ్లి చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి. ఆ ర‌కంగా అనంత్ అంబానీ అదృష్ట‌వంతుడు.

అంత‌టి అదృష్ట‌వంతుడైనా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతోన్న దుర‌దృష్ట‌వంతుడు కూడా. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే పెళ్లికి న‌న్నెందుకు పిల‌వ‌లేదు అంటూ తెలుగు బుల్లితెర నటి జ్యోతిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 2018 నుంచి తాను జియో వాడుతున్నానని, క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నానని అన్నారు. తాను అంబానీ చుట్టాన్ని కాదా? జియో వాడుతున్నవారంతా అంబానీ చుట్టాలు కాదా? అని ప్రశ్నించారు. ప్రపంచంలోని గొప్ప వాళ్లందరినీ పెళ్లికి పిలిచారు.

ఇన్నేళ్లుగా జియో వాడుతూ, మిమ్మల్ని పోషిస్తున్న మమ్మల్ని మాత్రం ఎందుకు పిలవలేదు. `నా క‌ష్ట‌మ‌ర్లు అంతా నా కుటుంబ స‌భ్యులే అంటారు కదా. మ‌రి పెళ్లికి పిల‌వ‌డానికి ఆ కుటుంబ స‌భ్యులు అవ‌స‌రం లేదా? అని వ్యంగాస్త్రం విసిరారు. ఇటీవ‌ల పెరిగిన‌ జియో ఛార్జీల‌పై వినియోగ‌దారులు అంబానీ పై మండి ప‌డిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com