Friday, November 15, 2024

నన్ను బలిపశువును చేశారు… కోర్టులో అసలు నిజాలు బైటపెట్టిన నిందితుడు సంజయ్ రాయ్

జూనియర్ డాక్టర్ హత్య ఘటనలో రోజుకో ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై దేశంలో ఇప్పటికి కూడా నిరసలను మిన్నంటాయి. దీని వెనుకాల ఉన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకొవాలని కూడా అన్నివర్గాల ప్రజల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆగస్టు 9 ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన వెలుగులోకి రాగానే.. నిందితుడు సంజయ్ రాయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని బ్లూటూత్ ఘటన స్థలంలో లభ్యం కావడం, అతని కదలికలు సీసీ ఫుటేజీలో లభించడం పట్ల కూడా ఈ ఘటనలో అతని పాత్రపై బలం చేకూర్చాయి.

అంతేకాకుండా.. సంజయ్ రాయ్ ను అరెస్టు చేసి పోలీసులు కోల్ కతా కోర్టు ఆదేశాల మేరకు పాలీగ్రాఫ్ టెస్టు లు చేసేందుకు కోల్ కతా నుంచి నిపుణులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. నిందితుడు మొబైల్ లో అశ్లీల వీడియోలు, అతను సైకో ప్రవర్తనపై కూడా అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగే కొన్ని గంటల ముందు కూడా అతను.. ట్రైనీ డాక్టర్ ను సీక్రెట్ ను ఫాలోఅయిన సీసీ ఫుటేజీ ఇటీవల వెలుగులోకి వచ్చింది.

మరోవైపు సీబీఐ కోర్టు చేసిన అనేక టెస్టులలో నిందితుడి బ్లడ్ సాంపుల్స్, అతని వెంట్రుకలు, గోర్లు,యువతి శరీరంపై దొరికిన వాటిని తో మ్యాచ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నిందితుడికి సుప్రీంకోర్టు సెప్టెంబర్ 6 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ క్రమంలో నిందితుడు.. శుక్రవారం రోజున కోల్ కతా హైకోర్టులో విచారణ సమయంలో తీవ్ర భావొద్వేగానికి గురయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

పూర్తి వివరాలు..

నిందితుడు సంజయ్ రాయ్ ను సీబీఐ పోలీసులు కోల్ కతాలోని హైకోర్టులో శుక్రవారం రోజున హజరుపర్చారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ముందు సంజయ్ రాయ్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. తనను ఈ కేసులో కావాలని ఇరికించారిని కూడా భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. మరోవైపు కోర్టు ఆదేశాలు, నిందితుడి అంగీకారం ప్రకారం సీబీఐ పాలిగ్రాఫే టెస్టును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో జడ్జీ మాట్లాడుతూ… నువ్వు తప్పు చేయనప్పుడు పాలీగ్రాఫ్ టెస్టుకు మరీ ఎందుకు అంగీకరించావని న్యాయమూర్తి ప్రశ్నించారు.

దీనికి సంజయ్ రాయ్ మాట్లాడుతూ.. ఈ టెస్టులలో అసలైన నిజాలు వెలుగులోకి వస్తాయని తాను అంగీకరించినట్లు చెప్పాడు. కొంత మంది కావాలని తనను బలిపశువును చేశారంటూ కూడా సంజయ్ రాయ్ కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. సంజయ్ రాయ్ తో పాటు మరో ఆరుగురికి సైతం పాలిగ్రాఫ్ టెస్టు చేయనున్నారు. వీరిలో ఆర్ జీ కర్ ఆస్పత్రి ప్రిన్స్ పాల్ సందీప్ ఘోష్ సైతం ఉన్నారు. ఘటన జరిగక ముందు రాత్రి పూట వీరిలో నలురుగు ట్రైనీ డాక్టర్ తో కలిసి డిన్నర్ సైతం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం సీబీఐ పోలీసులు నిర్వహించనున్న పాలీగ్రాఫ్ టెస్టు లేదా లైవ్ డిటెక్టర్ టెస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular