Wednesday, April 2, 2025

నేను ఇప్పుడు ఏ పార్టీ మనిషిని కాదు-ఆలీ

నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు

తెలుగు కమేడియన్, సీనియర్ నటుడు అలీ రాజకీయ రంగం నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో లేనని ఆలీ ప్రకటించారు. ఈ మేరకు ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు ఆలీ. నిర్మాత డి.రామానాయుడు కోసం టీడపీ హయాంలో 1999లో రాజకీయాల్లో అడుగుపెట్టా.. ఆ తర్వాత పార్టీ మారా.. ఎప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు.. పది మందికి సాయపడటం కోసమే రాజకీయాల్లోకి వచ్చా.. ప్రస్తుతం నేను ఏ పార్టీ మనిషిని కాదు.. అంటూ నటుడు అలీ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కొంత కాలంగా ఆలీ వైసీపీకి మద్దతుగా పనిచేయడంతో పాటు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపాలై.. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆలీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆలీపై తమకు వ్యక్తిగతంగా ఎటువంటి కోపం లేదని ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com