Saturday, January 18, 2025

ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష

అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్, ఆయన భార్య బుష్రాకు శిక్ష

పాకిస్థాన్ ప్రధాని ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీలను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష, బుష్రాకు ఏడేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. ఇమ్రాన్ కు 10 లక్షలు, బుష్రాకు 5 లక్షల పాకిస్థానీ రూపాయల జరిమానా విధించింది. అడియాలా జైల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య న్యాయమూర్తి తుది తీర్పును చదివి వినిపించారు.

అల్ ఖాదిర్ ట్రస్టు కేసు వివరాల్లోకి వెళితే… లండన్ లో ఉంటున్న పాకిస్థాన్ స్థిరాస్తి వ్యాపారి మాలిక్ రియాజ్ హుసేన్ Pakistani realtor Malik Riaz Hussain నుంచి వసూలు చేసిన 19 కోట్ల పౌండ్లను బ్రిటన్ ప్రభుత్వం పాకిస్థాన్ కు పంపగా… ఆ సొమ్మును ఇమ్రాన్ దంపతులు గోల్ మాల్ చేశారనేది వారిపై ఉన్న ఆరోపణ. ఆ సొమ్మును జాతీయ ఖజానాలో జమ చేయకుండా… సుప్రీంకోర్టు అంతకు ముందు రియాజ్ హుసేన్ కు విధించిన జరిమానాలో కొంత మొత్తాన్ని ఆ నగదు నుంచి కట్టడించారనేది వీరిపై ఉన్న అభియోగం. దీనికి బదులుగా ఇమ్రాన్ దంపతులు నెలకొల్పబోతున్న అల్ ఖాదిర్ విశ్వవిద్యాలయానికి 57 ఎకరాలను రియాజ్ హుస్సేన్ ఇచ్చినట్టు చెపుతున్నారు. ఇమ్రాన్ పై ఇప్పటి వరకు 200కు పైగా కేసులు ఉన్నాయి. 2023 ఆగస్ట్ నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com