హర్షం వ్యక్తం చేసిన అధికారులు
ఇండియన్ రిజిస్ట్రర్ క్వాలిటీ సిస్టమ్స్ (డివిజన్ ఆఫ్ ఐఆర్ క్లాస్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్) నుంచి ‘ఐఎంఎస్ సర్టిఫికెట్’ను రామగుండం ఫ్రైట్ డిపో అందుకుంది. దక్షిణ మధ్య రైల్వేలోని ప్రధానమైన ఫ్రైట్ డిపోల్లో ఒకటైన రామగుండం ఓవర్హాలింగ్ డిపో (ఆర్‌ఓఎచ్) ఐఆర్‌క్లాస్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్‌లోని ఒక విభాగం అయిన ఇండియన్ రిజిస్టర్ క్వాలిటీ సిస్టమ్స్ నుంచి ప్రతిష్టాత్మకమైన ‘ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్’ (ఐఏంఎస్) సర్టిఫికేషన్‌ను సాధించింది. దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న ఫ్రైట్ డిపోలలో రామగుండం డిపో మాత్రమే ఐఏంఎస్ సర్టిఫికేషన్ పొందిన ఏకైక డిపో కావడం గమనార్హం. ఈ డిపోలో అంతర్గత వ్యవస్థ నిర్వహణ మెరుగుపరచడం, రికార్డులు భద్రపరచడం వాటి నిర్వహణ విధానాన్ని క్రమబద్ధీకరించడం ద్వారా ఈ ఘనతను సాధించడానికి ప్రతికూల అంశాలుగా మారాయి.
1982లో రామగుండం ఫ్రైట్ డిపో ఏర్పాటు
రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగుండం ఫ్రైట్ డిపో 1982లో స్థాపించబడింది. ఈ డిపో ఆర్‌ఓఎచ్ (రొటీన్ ఓవర్హాలింగ్) అటెన్షన్, యార్డ్ ఎగ్జామినేషన్, బాక్స్ ఎన్, బిఓ బిఆర్‌ఎన్, బిసిఎన్ మొదలైన వివిధ రకాల వ్యాగన్ల సిక్ లైన్ అటెన్షన్ వంటి అనేక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఈ డిపో ఆధ్వర్యంలో నెలకు 280 వ్యాగన్ల సాధారణ ఓవర్హాలింగ్ జరుగుతోంది. వీటితో పాటు ఈ డిపోలో ఎన్‌టిపిసి (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్)కు సంబంధించిన ప్రైవేట్ వ్యాగన్‌ల ఆర్‌ఓఎచ్‌ను నిర్వహిస్తోంది.
అభినందనలు తెలిపిన జిఎం
ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (ఐఏంఎస్) సర్టిఫికేషన్ అనేది సాధారణంగా ఒకే ఆడిట్లో మూల్యాంకనం చేయబడిన బహుళ నిర్వహణ వ్యవస్థ ప్రమాణాలకు సంబంధించిన ధృవీకరణ ప్రక్రియ. రామగుండం డిపో వివిధ ప్రమాణాలు, నిబంధనలను పాటించడంలో దాని నిబద్ధతను ప్రదర్శిస్తూ (నాణ్యత నిర్వహణ, పర్యావరణ సమతుల్య నిర్వహణ, వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రత నిర్వహణ వంటివి) నిర్వహణ వ్యవస్థలను విజయవంతంగా అమలు చేసిందని తెలియజేసే ధృవీకరణ పత్రం.
ఐఏంఎస్ సర్టిఫికేట్ ఈ ఫ్రైట్ డిపో యొక్క పని విధానాన్ని మరింతగా క్రమబద్ధీకరించడం, దాని సామర్ధ్యాన్ని అన్ని విధాలుగా మెరుగు పరిచేందుకు దోహదపడుతోంది. రామగుండం ఫ్రైట్ డిపోకు ఐఏంఎస్ సర్టిఫికేషన్ పొందడానికి సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ భరతేష్ కుమార్ జైన్, డివిజన్ మెకానికల్ విభాగం చేసిన కృషికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందనలు తెలియజేశారు.