Friday, November 15, 2024

CMRF Scam : వైద్యం చేయకపోయినా బిల్లులు ఆరు కేసులు నమోదు చేసిన సీఐడీ

సీఎంఆర్‌ఎఫ్‌ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో సీఐడీ తాజాగా ఆరు కేసులు నమోదు చేసింది. వైద్యం చేయకపోయినా చేసినట్లు పలు ఆస్పత్రులు బిల్లులు సృష్టించాయి. ఏడాదిన్నరగా ఈ సీఎంఆర్‌ఎఫ్‌ నిధుల స్వాహా కొనసాగుతుంది. ఈ క్రమంలో 28 ఆస్పత్రులపై ఆరోపణలు రాగా.. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రులపై కేసులు నమోదు చేసింది సీఐడీ. పిల్లలకు వైద్యం చేసినట్లు నకిలీ బిల్లులతో సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు కొటేసినట్లు ఆరోపణలున్నాయి.

28 ఆసుపత్రులు కలిసి వందల కోట్ల రూపాయల సీఎంఆర్ నిధులు స్వాహా చేశారని నిర్ధారణ జరిగింది. ఆస్పత్రి సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు కలిసి ఈ నిధులు కొట్టేసారని విచారణలో వెల్లడైంది. సీఎంఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఈ స్కాంపై గత ఏప్రిల్లో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుపై విచారణ చేపట్టారు. ఇందులో ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేసిన సీసీఎస్‌ నలుగురి అరెస్ట్ చేసింది. అయితే సీఎంఆర్‌ఎఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా అవినీతి జరగడంతో ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular