-
వారానికి ఐదు రోజులు.. విత్ అవుట్ డ్రెస్
-
అక్కడి స్త్రీలు దుస్తులు విప్పి వీధుల్లో తిరుగుతారట..!
మన దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. విభిన్న జాతులు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన ప్రజలు ఒక్కటిగా బతుకుతున్న దేశం. కాబట్టి ఈ దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అలాంటి వాటిని కొన్ని ఆచారాలు చాలా వింతగా అనిపిస్తాయి. ఓ గ్రామంలో మహిళలు పాటిస్తున్న అలాంటి ఓ వింత ఆచారం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం…
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మణికర్ణ లోయలో పిని అనే ఓ గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఓ వింత ఆచారం అమలులో ఉన్నది. ఆ గ్రామానికి చెందిన మహిళలు ఒంటిపై దుస్తులు ధరించకుండా నగ్నంగా గ్రామంలో తిరుగుతారు. అయితే ఈ వింత ఆచారం ఏడాది పొడవునా ఉండదు. ఏడాదికి ఒక ఐదు రోజులు ఆ గ్రామానికి చెందిన మహిళలు ఈ ఆచారాన్ని పాటిస్తారు.
భర్తలకు కూడా…
శతాబ్దాల కాలం నాటి ఈ ఆచారాన్ని అక్కడి మహిళలు ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఆచారం కేవలం స్త్రీలకు సంబంధించినది అయినా పురుషులు కూడా కొన్ని నియమాలు పాటించాలి. మహిళలు ఈ ఆచార వ్రతంలో ఉన్నప్పుడు వారి భర్తలు వాళ్లతో మాట్లాడకూడదు. మద్యం, మాంసం ముట్టకూడదు. అలా చేస్తే వ్రత భంగం కలిగి కీడు జరుగుతుందని ఆ గ్రామస్తుల నమ్మకం. ప్రతి ఏడాది ఆ ఐదు రోజులు మహిళలు నగ్నంగా ఉండకపోతే ఆపద వస్తుందని అక్కడి ప్రజల భయం. ఈ భయం వెనుక ఒక పురాణ కథ ఉన్నది. శతాబ్దాల క్రితం వారి గ్రామాన్ని రాక్షసులు ఆక్రమించారట. ఆ సమయంలో అసురులు అందమైన దుస్తులు ధరించిన వివాహిత స్త్రీలను తీసుకువెళ్లారట. మొత్తం ఐదు రోజులపాటు రాక్షసులు ఈ దారుణానికి పాల్పడ్డారట.
దాంతో దేవుడు లాహువా ఘోంట్ ఆ గ్రామానికి వచ్చి ఆ రాక్షసులను నాశనం చేశాడట. అందుకే ఏడాదిలో ఆ ఐదు రోజులు మహిళలు దుస్తులు ధరిస్తే కీడు జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే ఏటా ఆ ఐదు రోజులపాటు స్త్రీలు తమ దుస్తులను వదిలేస్తారు. లేదంటే రాక్షసులు కీడు తలపెడతారని వారి నమ్మకం.