Wednesday, May 14, 2025

టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం

కృష్ణాజిల్లా:గన్నవరం నియోజకవర్గం: వైకాపా నేత విజయసాయిరెడ్డి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గన్నవరం నియోజకవర్గ తెలుగుయువత డిమాండ్. వైకాపా నేత వి.విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల గన్నవరం నియోజకవర్గ తెలుగుయువత నాయకులు భగ్గుమన్నారు. గన్నవరం పోలీసు స్టేషన్ లో విజయసాయిరెడ్డి మరోసారి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకొని శాంతిభద్రతలు కాపాడాలని తెలుగుయువత నాయకులు కంప్లైట్ నమోదు చేశారు.

ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గ తెలుగుయువత అద్యక్షులు పరుచూరి నరేష్, రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి కొసరాజు సాయి, గన్నవరం నియోజకవర్గ తెలుగుయువత ఉపాద్యక్షులు తాటిపాముల నాగయ్య, గన్నవరం నియోజకవర్గ తెలుగుమహిళా అద్యక్షురాలు మేడేపల్లి రమ తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

దివంగత రాజశేఖర రెడ్డి గారి మరణం, వై.ఎస్ షర్మిల మరియు జగన్మోహనరెడ్డి గారి వివాదం వెనుక చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందని విజయసాయిరెడ్డి చేస్తున్న విషప్రచారం మానుకోకుంటే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా మీడియా ముందుకొచ్చి నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ తెలుగుయువత నాయకులు వంగా అయ్యప్పరెడ్డి, అలుగోజి నాగబాబు, చల్లగుల్ల సందీప్, పూర్ణ, బొబ్బా సాయి, ఎల్లా రఘు, తంగిరాల శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com