స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యలయంలో గురువారం అపశ్రుతి చోటు చేసుకుంది. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ ఎన్సీ.రాజమౌళి జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించి జెండాను అవమానపరిచారు. జెండాను తలకిందులుగా ఎగరేయడంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. పొరపాటును గుర్తించి వెంటనే జెండాను కిందికి దింపి కాషాయ వర్ణాన్ని పైకి పెట్టి మరల ఆవిష్కరించారు.
భారత దేశానికి ఎందరో మహాత్ముల ప్రాణ త్యాగాలతో సంపాదించుకున్న స్వాతంత్ర చిహ్నాన్ని విద్యావంతులై ఉండి జెండాను తల కిందులుగా ఆవిష్కరించడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలకు దారితీసింది. బాధ్యత గల పౌరులు జెండా ఆవిష్కరణలో నిర్లక్ష్యం వహించడం భారత దేశానికే అవమానమని మండల వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. జెండా ఆవిష్కరణపై అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం తగదని ప్రజలు విమర్శిస్తున్నారు.