Wednesday, January 8, 2025

పెరిగిన గంజాయి, నాటుసారా కేసులు

  • గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఐదింతలు పెరుగుదల
  • గత ఏప్రిల్‌లో 867 కేసులు, ఈ సంవత్సరం ఏప్రిల్‌లో 5,510 కేసులు

గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం గంజాయి, నాటుసారా కేసులు ఐదింతలు పెరిగాయి. గంజాయితో పాటు నాటుసారాకు సంబంధించి గత సంవత్సరం ఏప్రిల్‌లో 867 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం ఏప్రిల్‌లో 5,510 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి 863 వ్యక్తులపై కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం 1,494 మందిపై ఎక్సైజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో భాగంగా గత సంవత్సరం ఐడి 4,550 లీటర్‌లను స్వాధీనం చేసుకోగా, ఈ సంవత్సరం 29,518 లీటర్ల ఐడిని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు బిజే 35,411 కిలోలు గత సంవత్సరం స్వాధీనం చేసుకోగా, ఈ సంవత్సరం 1,40,788 కిలోలను, గత సంవత్సరం అలం 2,631 కిలోలు, ఈసారి 5,047 కిలోలు, గత సంవత్సరం ఎఫ్‌జే వాష్ 55,850 లీటర్‌లు, ఈసారి 24,15,925 లీటర్‌లు, గత సంవత్సరం 136 వాహనాలు, ఈసారి 188 వాహనాలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

76 కేసులతో జగిత్యాల చివరిస్థానం
ఇక ఈ సంవత్సరం జనవరి నుంచి ఈ ఏప్రిల్ వరకు (నాలుగు నెలలకు) సంబంధించి వరంగల్ రూరల్ జిల్లా 246 కేసులతో ప్రథమ స్థానం దక్కించుకోగా, జగిత్యాల 76 కేసులతో చివరిస్థానం దక్కించుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో 189 కేసులు నమోదు కాగా, (116 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. ఇదే జిల్లాలోని లక్షెట్టిపేటలో 115 కేసులు నమోదు కాగా, (116 మంది వ్యక్తులను)అరెస్టు చేశారు. బెల్లంపల్లిలో 203 కేసులు నమోదు కాగా, (114 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. నిర్మల్‌లో 222 కేసులు నమోదు కాగా (155 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో 205 కేసులు నమోదు కాగా, (147 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు.

జగిత్యాల జిల్లా ధర్మపురిలో 76 కేసులు నమోదు కాగా, (12 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌బాద్‌లో 154 కేసులు నమోదు కాగా, (66 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 110 కేసులు నమోదు కాగా, (43 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. వనపర్తి జిల్లా వనపర్తిలో 154 కేసులు నమోదు కాగా, (72 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. ఇదే జిల్లా కొత్తకోటలో 106 కేసులు నమోదు కాగా, (33 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 111 కేసులు నమోదు కాగా, (84 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. ఇదే జిల్లా తెల్కపల్లిలో 99 కేసులు నమోదు కాగా, (87 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు.

నర్సంపేటలో 246 కేసులు…198 మంది వ్యక్తులు….
వీటితో పాటు కల్వకుర్తిలో 115 కేసులు నమోదు కాగా, (51 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో 159 కేసులు నమోదు కాగా, (89 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. ఇదే జిల్లా నర్సంపేటలో 246 కేసులు నమోదు కాగా, (198 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. వర్ధన్నపేటలో 202 కేసులు నమోదు కాగా, (110 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్‌లో 204 కేసులు నమోదు కాగా, (155 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. ఇదే జిల్లా తొర్రూర్‌లో 164 కేసులు నమోదు కాగా, (151 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. గూడూరులో 149 కేసులు నమోదు కాగా, (88 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో 158 కేసులు నమోదు కాగా, (80 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. ఇదే జిల్లా ములుగులో 257 కేసులు నమోదు కాగా, (138 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. కాటారంలో 134 కేసులు నమోదు కాగా, (67 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. వీటితో పాటు నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో 173 కేసులు నమోదు కాగా, (75మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో 230 కేసులు నమోదు కాగా, (181 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 86 కేసులు నమోదు కాగా, (73 మంది వ్యక్తులను) అరెస్టు చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com