పాకిస్థాన్ పని పట్టేందుకు భారత్ కంకణం కట్టుకుంది. 70 ఏళ్ల నుంచి పాకిస్థాన్ కవ్విస్తుంటే.. భారత్ శాంతిగా వ్యవహరించింది. కానీ, 26 మంది అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకోవడంతో.. భారత్ దీటుగా జవాబునిచ్చింది.
ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్థాన్‌కు అర్థరాత్రి పూట చుక్కలు చూపెట్టింది. దీంతో, పాకిస్థాన్ గురువారం రాత్రి భారత్‌పై క్షిపణుల దాడిని చేసింది. దీన్ని సమర్థంగా తిప్పికొట్టడంతో పాటు పాకిస్థాన్ ప్రధాన నగరాలపై భారత్ విరుచుకుపడింది. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌పై మెరుపుదాడి చేసింది. నాలుగువైపులా భారత్ విరుచుకు పడుతుండటంతో ఏం చేయాలో అర్థం కాక పాకిస్థాన్ తలపట్టుకుంటున్నట్లు సమాచారం.