- రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి ప్రభుత్వం చూస్తోంది
- కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్
భారత రాజ్యాంగం ప్రమాదకర స్థితిలో ఉందని, రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి ప్రభుత్వం చూస్తోందని, పిల్లల భవిషత్ కోసం ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జరిగిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల టిఆర్‌ఎస్ పాలనను ప్రజలు చీదరించుకుంటారని భావించి బిఆర్‌ఎస్‌గా మారిందని, దేశంలో బిజెపి పార్టీ కాస్త జూటా పార్టీగా మారిందని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులను దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారన్నారు.
బతుకమ్మతో కవిత బ్రతకనేర్చి లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లిందని కెసిఆర్ కుటుంబానికి 12వందల అమరుల కుటుంబాల ఉసురు తాకిందన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్‌లు తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫేక్ వీడియో కేసు పెట్టి భయపెట్టాలని చూస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మోడీ కి గ్యారంటీ అంటే అన్నింటికీ రేట్లు పెంచడమే రిజర్వేషన్లపై మోడీ ఆత్మ రక్షణలో పడ్డారన్నారు.