రెండో టెస్టులో సౌతాఫ్రికాను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన భారత్ జట్టు
కేప్ టౌన్‌లో భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మూడు వికెట్లను కోల్పోయి చేధించింది. సౌతాఫ్రికాను 177 పరుగులకే భారత్ ఫాస్ట్ బౌలర్లు కట్టడి చేశారు. బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ రెండు వికెట్లు తీసుకున్నాడు. సౌతాఫ్రికా బ్యాట్సమన్ మర్‌క్రమ్ సెంచరితో జట్టును ఆదుకున్నాడు. 79 పరుగులను చేధించడానికి బరిలోకి దిగిన భారత జట్టులో.. జైస్వాల్ ఆరంభం నుంచే సౌతాఫ్రికా బౌలర్ల మీద ఎదురు దాడి చేశాడు. వరుస ఫోర్లతో విరుచుకు పడ్డాడు. మొదటి నాలుగు ఓవర్లలో భారత్ జట్టు 32 పరుగులు చేసిందంటే.. జైస్వాల్ ఎంత ధాటికి బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. అతను 23 బంతుల్ని ఎదుర్కొని ఆరు బౌండరీలతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. మొత్తానికి, సీరిస్‌ను భారత్ జట్టు ఒకటి ఒకటితో సమం చేసింది. తక్కువ స్కోరు చేసినా విజయం సాధించిన జట్టు ఏదైనా ఉందా అంటే ఆస్ట్రేలియా అని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఆ మ్యాచు 1882లో ఓవల్‌లో జరిగింది. ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టుకు 85 పరుగుల టార్గెట్ ఇచ్చిన ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌ను 77 పరుగులకే ఆలౌట్ చేసింది.