Sunday, April 20, 2025

భారత ప్రధాని మోదీ మెచ్చిన బ్లాక్ రైస్

  • భారత ప్రధాని మోదీ మెచ్చిన బ్లాక్ రైస్
  • బ్లాక్ రైస్ లో లెక్కలేనన్ని పోషక విలువలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్లాక్ రైస్‌ని మెచ్చుకున్నారు. ప్రస్తుతం  అస్సాంలో ఎక్కువగా పండిస్తున్న బ్లాక్ రైస్ సూపర్ ఫుడ్ అని కొనియాడారు. అప్పుడప్పుడు తాను కూడా బ్లాక్ రైస్ తింటానని చెప్పారు ప్రధాని మోదీ. దీంతో చాలా మంది అసలు బ్లాక్ రైస్ అంటే ఎంటీ, ఈ బ్లాక్ రైస్ స్పెషాలిటీ ఏంటని గూగుల్ లో వెతుకుతున్నారు. ప్రస్తుతం భారత్ లో  బ్లాక్ రైస్ ఎక్కువగా తింటున్నారు. వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటంతో.. ఆరోగ్య రిత్య చాలా మంది వైట్ రైస్ తినడానికి ఇష్టపడం లేదు. అందుకు ప్రత్యమ్నాయంగా బ్లాక్ రైస్ ను తింటున్నారు చాలా మంది.

బ్లాక్ రైస్ చూడటానికి నల్లగా ఉన్నా.. వండిన తర్వాత మాత్రం వంకాయ రంగులో కనిపిస్తాయి. ఇప్పుడు జపాన్, థాయ్ ల్యాండ్, చైనా, ఇండోనేషియాల్లో సైతం  బ్లాక్ రైస్ ను పండిస్తున్నారు. మన దేశంలో మాత్రం అస్సాం, మణిపూర్,  మేఘాలయ రాష్ట్రాల్లో బ్లాక్ రైస్ ను పండిస్తున్నారు. బ్లాక్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఈ రైస్‌ లో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఇన్నాయని అంటున్నారు. ఈ రైస్ లో ప్రోటీన్, క్యాలరీలు, మంచి కొవ్వులు, పీచు పదార్థాలు, ఐరన్, సోడియం, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.

ఇక బ్లాక్ రైస్ లో పీచు పదార్థాలు సైతం ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మరీ ముఖ్యంగా మలబద్ధకం సమస్య తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ రైస్ తినడం వల్ల పేగుల్లో ఉండే మలినాలు తొలగి.. పేగుల ఆరోగ్యం కూడా పెరుగుతుంది. బ్లాక్ రైస్ శరీరాన్ని డీటాక్స్ చేయడంలో చక్కగా సహాయం చేస్తుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలను, మలినాలను బయటకు పంపుతుంది. బ్లాక్ రైస్ కాలేయ పనితీరును సైతం కూడా మెరుగు పరుస్తుంది.

మనం రోజూ తినే వైట్‌ రైస్ కంటే బ్లాక్ రైస్ తినడం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు గుర్తించారు. ఇందులో యాంటీ డయాబెటిక్ వ్యాధి లక్షణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. అలాగే బ్లాక్ రైస్ లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు సైతం ఉండటంతో టైప్ -2 డయాబెటీస్ రాకుండా నివారిస్తుంది. ఇక బ్లాక్ రైస్‌లో లూటిన్, బీటాకెరోటిన్, లైకోపీన్  వంటివి కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. యూవీ కిరణాల నుంచి కంటికి రక్షణగా నిలుస్తుంది. బ్లాక్ రైస్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తగ్గడమే కాకుండా.. కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com