బీఆర్‌ఎస్ నేతల అరెస్టులపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు.. ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన అని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కవిత పేర్కొన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన మా పార్టీ సీనియర్ నేతలను తక్షణమే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీని కవిత డిమాండ్ చేశారు.