-
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు
-
బిఆర్ఎస్ అంటే బిల్లా రంగ సమితి
-
బిజెపి బిఆర్ఎస్ ది చీకటి ఒప్పందం
-
ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
టీఎస్, న్యూస్:అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిర మహిళను అందజేసి పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గారండీ ఇలా భాగంగా సోమవారం భద్రాద్రి జిల్లాలోని భద్రాచలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఏఎంసి గ్రౌండ్, మణుగూరు లో జరిగిన ప్రజా దీవెన సభలో ఆయన మాట్లాడారు.
భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇండ్లు పథకం లక్ష్యం అని చేశారు.
ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లు అని విశ్వసించి ఇందిరమ్మ ఇండ్లను ఆడబిడ్డల పేరుతో పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.రూ.22,500 కోట్లతో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని ప్రతి నియోజకవర్గానికి 3500 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని 100 అడుగుల లోతులో పాతిపెట్టిన ఖమ్మం జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.కుటుంబ పాలన సాగిస్తూ తెలంగాణ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసినందుకే కేసీఆర్ పాలనను బొందపెట్టి ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని అన్నారు.ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ పార్టీకి బలమైన బంధం ఉందని
అందుకే ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ఖమ్మం జిల్లాలో ప్రారంభించాం అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా రూ.500 లకే గ్యాస్ సిలిండర్ , మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం
పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ,పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు అందించేందుకు ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
ఏ ఊరిలో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో ఆ ఊర్లోనే మీరు ఓట్లు అడగాలని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన గ్రామాల్లో మేం ఓట్లు అడుగుతామని కెసిఆర్ కు సవాల్ విసిరారు పేదలకు ఇండ్లు ఇస్తామన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక శాపనార్ధాలు పెడుతున్న కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితలను విమర్శలతో దుయ్యబట్టారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామచంద్రస్వామి వారి దర్శనం చేసుకున్నారు. మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభం,వేదమంత్రోచరణలతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి శేష వస్త్రత్రం, స్వామివారి తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్ర పటం, మేమొంటో అందజేసి ఆశీర్వాదం అందజేశారు.
ఈ కార్యక్రమంలోరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు , ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి , పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ దీప్ దాస్ మున్సీ, ఎమ్మెల్యేలు పాయ వెంకటేశ్వర్లు, రాందాస్ నాయక్, కోరం కనకయ్య, జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, మట్ట రాగమయి, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్,
జిల్లా కలెక్టర్, ప్రియాంక అలా, ఎస్పీ రోహిత్ రాజ్, దేవదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.