మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు కుమ్మరి రవీందర్ ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేదని బుధవారం రాత్రి పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానానికి పాల్పడ్డాడు. లబ్దిదారుల ఎంపికలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కమిటీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరించి జాబితా నుంచి తన పేరు తొలగించారని మనస్తాపంతో రవీందర్ పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే వైద్యం కోసం అతడిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిరుపేదైన తనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించక , కేవలం కాంగ్రెస్ నాయకులకే ఇల్లు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని బాధితుడు రవీందర్ కోరారు.