టీఎస్, న్యూస్:లోక్‌సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పార్టీ గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈమేరకు పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. బుధవారం రాత్రి గాంధీభవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్శి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో ఇంద్రకరణ్ రెడ్డి, డాక్టర్ వెన్నెల అశోక్, సంచార జాతుల కులాలకు చెందిన ముఖ్య నాయకులు చేరారు.